ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కురువలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

ABN, Publish Date - Dec 24 , 2023 | 11:53 PM

రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం కలిగి ఉన్న కురువ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యమివ్వాలని కురువ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

సింహ గర్జనలో పిలుపునిచ్చిన నాయకులు

ఆలూరు, డిసెంబరు 24: రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం కలిగి ఉన్న కురువ సామాజిక వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యమివ్వాలని కురువ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం ఆలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో మాదాసి కురువ, మాదారి కురువ మహా సింహగర్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కురువ కులస్థులు హాజరయ్యారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్‌ శశికళ కృష్ణమోహన్‌, బత్తిన లక్ష్మీనారాయణ, పంచలింగాల నాగరాజు, డాక్టర్‌ ప్రసాద్‌, కురువ దేవేంద్ర ఆధ్వర్యంలో ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు లక్షల మంది పైగా జనాభా ఉన్న కురువలకు కేవలం సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర పదవులు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కురువ వర్గానికి అన్ని రాజకీయ పార్టీలు ఒక పార్లమెంట్‌, రెండు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మాదాసి, మాదారి కురువలకు రాజ్యాంగంలో పేర్కొన్న మేరకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలన్నారు. ఎస్సీ ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కురువలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కర్ణాటకలో కురువలు ఐక్యంగా ఉండటం వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రిగా రాజ్యాధికారం సాధించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే కురువలకు టికెట్లు ఇస్తుందో, వారికి మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్టాటక పీఠాధిపతులు సిద్దనాథేశ్వర స్వామి, తుముకూర్‌ అల్లుమఠ పీఠాధిపతి హిందూ శేఖర్‌ వడియార్‌, అరుణోదయ మండలి గాయకురాలు కవితక్క, మాజీ ఎంపీ విరుపాక్షప్ప, రిటైర్డ్‌ జడ్జి కృష్ణప్ప, సీపీఐ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, మాజీ జడ్పీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, మాజీ వైస్‌ చైర్మన్‌ బుజ్జమ్మ, మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్లు కురువ జయరాం, శ్రీనివాసలు, నాయకులు గడ్డం రామకృష్ణ, కుబేర్‌నాథ్‌, రఘుబాబు, దేవేంద్ర, హనుమప్ప, ఉరుకుందు, భాస్కర్‌, రామ్మోహన్‌, లింగమూర్తి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 11:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising