వేంకటేశ్వర స్వామికి కుంకుమార్చన
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:01 AM
మండలంలోని వాసాపురంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామికి భక్తులు కుంకుమార్చన చేశారు.
రుద్రవరం, డిసెంబరు 16: మండలంలోని వాసాపురంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామికి భక్తులు కుంకుమార్చన చేశారు. అర్చకుడు వారణాసి గోపిశ ర్మ అభిషేకం చేసి వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో త రలివచ్చిన భక్తులు కుంకుమార్చనలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మానస లింగేశ్వరస్వామికి, త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అభిషేకం చేసి పూజలు ప్రారంభించగా, భక్తులు దర్శనం చేసుకున్నారు.
నరసాపురం, రుద్రవరం, దొర్వి, గుట్టకొండ నరసింహస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అభిషేకం చేసి పూజలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:01 AM