కొనసాగుతున్న న్యాయవాదుల దీక్షలు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:49 AM
భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి.
కర్నూలు(లీగల్), డిసెంబరు 25: భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు సోమవారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలలో కూర్చున్న వారిలో న్యాయవాదులు కరుణాకర్, రాంపుల్లయ్య, జనార్దన్, అశోక్ కుమార్ ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, నాయకులు నరసింహులు, తిరుపాలు, మాబు న్యాయవాదుల శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. సీనియర్ న్యాయవాదులు ఓంకార్, చంద్రుడు, క్రిష్ణమూర్తి, నాగముని, బార్ అసోసియేషన్ అద్యక్షుడు టి.నాగభూషణం నాయుడు, ప్రధాన కార్యదర్శి చక్రపాణిలు దీక్షలకు తమ మద్దతు తెలిపారు.
Updated Date - Dec 26 , 2023 | 12:49 AM