ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సచివాలయాలకు ఎలా అప్పగిస్తారు?

ABN, Publish Date - Dec 18 , 2023 | 11:53 PM

అంగన్‌వాడీ సెంటర్లను సచివాలయాలకు ఎలా అప్పగిస్తారని, ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చేస్తే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జే లలితమ్మ హెచ్చరించారు.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ

కార్పొరేషన్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నా

కర్నూలు(న్యూసిటీ) డిసెంబరు 18: అంగన్‌వాడీ సెంటర్లను సచివాలయాలకు ఎలా అప్పగిస్తారని, ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే చేస్తే కార్పొరేషన్‌ను ముట్టడిస్తామని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జే లలితమ్మ హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ అధ్వర్యంలో సోమవారం ఎస్టీబీసీ కళాశాల నుంచి కార్పొరేషన్‌ వరకు అంగన్‌వాడీలు ఽర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్‌ ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వానికి, కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లలితమ్మ మాట్లాడుతూ తమ న్యాయమైన 17 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే పట్టించుకోని అధికారులు అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులకొట్టడం ఏమిటని ప్రశ్నించారు. అంతేగాకుండా సెంటర్ల నిర్వహణ బాధ్యతను సచివాలయాలకు ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తక్షణమే చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. అనంతరం మేనేజర్‌ చిన్నరాముడుకు వినతి పత్రం అందజేశారు.

Updated Date - Dec 18 , 2023 | 11:53 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising