ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వృద్ధులను ఆదరించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:46 PM

వయో వృద్ధులను ఆదరించాలని డోన్‌ సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి అన్నారు.

డోన్‌లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న డోన్‌ సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి

డోన్‌(రూరల్‌), డిసెంబరు 17: వయో వృద్ధులను ఆదరించాలని డోన్‌ సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి తంగమణి అన్నారు. ఆదివారం పట్టణంలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో పెన్షనర్ల దినోత్సవాన్ని ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్‌ సబ్‌ కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి తంగమణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన పెన్షనర్ల సభలో పెన్షనర్లనుద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు రిటైర్డు అయిన తర్వాత వారికి వచ్చే పెన్షనే ఆర్థిక స్వాలంబనంగా ఉపయోగ పడుతుందన్నారు. పెన్షనర్లు చట్టాల్లో అమలవుతున్న మార్పు లపై అవగాహన కలిగి తమ హక్కులను పరిరక్షించుకోవాలని సూచిం చారు. సమావేశంలో పెన్షనర్ల సంఘం గౌరవాధ్యక్షుడు దత్తాత్రేయ శర్మ, సంఘం అధ్యక్షుడు భానుసింగ్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు మౌలాలి, కార్యదర్శి గాలయ్య, కోశాధికారి గోపాల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌, డోన్‌ సబ్‌ ట్రెజరర్‌ అధికారి రఘునందన్‌ హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెన్షనర్లు పాల్గొన్నారు.

చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని బాలికోన్నత పాఠశాలలో ఆదివారం విశ్రాంత ఉద్యోగులు ఘనంగా పెన్షనర్ల దినోత్సవం నిర్వహించారు. డీకే నకరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పెన్షనర్ల సంఘ అధ్యక్షుడు పోలిశెట్టి మాట్లాడుతూ పెన్షనర్ల డీఏ, బకాయిలు, హరియర్స్‌ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2018 తరువాత పదవీ విరమణ చెందిన వారి గ్రాడ్యూటీ, కమ్యూటేషన్‌ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు ఎంవి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌, కోశాధికారి రంగయ్య, పెన్షనర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 11:46 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising