జీవో 512 ప్రతుల దహనం
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:12 AM
భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు శనివారం జీవో 512ను ప్రతులను దహనం చేశారు.
కర్నూలు(లీగల్), డిసెంబరు 23: భూమి హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక ధర్నా చౌక్‌లో న్యాయవాదులు శనివారం జీవో 512ను ప్రతులను దహనం చేశారు. పేద రైతుల కడుపు కొడుతున్న ఈ జీవోను వెంటనే రద్దు చేసి రైతుల హక్కులను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. శనివారం రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు బాబు సాహెబ్, మహావిష్ణు, తిరుపతయ్య, మధుసూదన్, కేశవ్, ఉదయ్ ప్రతాప్ పాల్గొన్నా రు. సీనియర్ న్యాయవాదులు పి.రామాంజనేయులు, కే ఓంకార్, శ్రీధర్, చెన్నయ్య శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
Updated Date - Dec 24 , 2023 | 12:12 AM