వైభవంగా చండీహోమం
ABN, First Publish Date - 2023-11-06T00:36:47+05:30
చాగలమర్రి గ్రామంలోని చిన్నమకానం వీధిలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం వేద పండితుడు కైప పెద్దశాస్త్రీ ఆధ్వర్యంలో దంపతులతో వైభవంగా చండీహోమం చేశారు.
చాగలమర్రిలో చండీ హోమం చేస్తున్న వేద పండితులు
చాగలమర్రి, నవంబరు 5: చాగలమర్రి గ్రామంలోని చిన్నమకానం వీధిలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో ఆదివారం వేద పండితుడు కైప పెద్దశాస్త్రీ ఆధ్వర్యంలో దంపతులతో వైభవంగా చండీహోమం చేశారు. కలశ స్థాపన, గణపతిహోమం, రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమా లను నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చౌడేశ్వరీదేవికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-06T00:36:48+05:30 IST