పోలీసుల అదుపులో చైన్ స్నాచర్లు
ABN, Publish Date - Dec 30 , 2023 | 12:42 AM
ఇద్దరు చైన్ స్నాచర్లను కర్నూలు తాలుకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కర్నూలు, డిసెంబరు 29: ఇద్దరు చైన్ స్నాచర్లను కర్నూలు తాలుకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలుకు చెందిన వీరు సుమారు 7పైగా నేరాల్లో పాల్గొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గత కొద్ది కాలంగా వీరి పై నిఘా ఉంచిన పోలీసులు శుక్రవారం కర్నూలు రాగానే అదుపులోకి తీసు కుని స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి సుమారు 20 లక్షల పైగా సొత్తును రికవరి చేసినట్లు తేలింది.
Updated Date - Dec 30 , 2023 | 12:42 AM