దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2023-12-03T00:33:26+05:30
తవ్వే కొద్దీ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు బయటపడుతున్నాయని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 2: తవ్వే కొద్దీ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు బయటపడుతున్నాయని, ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఓటర్లకు పిలుపునిచ్చారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని తెలుసుకున్నారన్నారు. తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలాదిగా దొంగ ఓట్లను తన ప్రజా ప్రతినిధులు, వైసీపీ క్యాడర్, వలంటీర్లతో నమోదు చేయించారని ఆరోపించారు. అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల ఓట్లను జాబితాలో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్ల చేరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాబితాలో తమ ఓటు ఉన్నదీ లేనిదీ పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-12-03T00:33:29+05:30 IST