ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బేకరి నిర్వాహకులతో గొడవ

ABN, Publish Date - Dec 14 , 2023 | 12:30 AM

నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్‌ ఎదురుగా ఓ ట్రాక్టర్‌ యజమాని తన వరిగడ్డికి నిప్పంటించాడు.

ట్రాక్టర్‌ వరిగడ్డికి నిప్పంటించిన యజమాని

కర్నూలు, డిసెంబరు 13: నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కోడుమూరు రహదారిలో అమీలియో హాస్పిటల్‌ ఎదురుగా ఓ ట్రాక్టర్‌ యజమాని తన వరిగడ్డికి నిప్పంటించాడు. ట్రాక్టర్‌ యజమాని రాజశేఖర్‌ రెడ్డి నంద్యాల జిల్లా గోవిందపల్లె నుంచి కర్నూలు మండలం ఉల్చాలకు ట్రాక్టరులో వరిగడ్డిని తీసుకెళ్తున్నాడు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అమీలియో హాస్పిటల్‌ ఎదురుగా ఉన్న ఎస్‌ఎల్‌వీ బేకరి ఎదుట టీ తాగేందుకు ట్రాక్టర్‌ను ఆపాడు. పక్కన టీ స్టాల్‌లో టీ తాగు తుండగా. ఎల్‌ఎల్‌వీ బేకరి నిర్వాహకుడు రాజశేఖర్‌ రెడ్డితో ట్రాక్టర్‌ అడ్డుగా తీయాలని గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి బేకరి నిర్వహకులు రాజశేఖర్‌ రెడ్డిపై దాడి చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన రాజశేఖర్‌ రెడ్డి ట్రాక్టర్‌ వరిగడ్డిని అక్కడే దించేసి ట్రాక్టర్‌ను పక్కన పెట్టాడు. ఆ తర్వాత వెంటనే వరిగడ్డిపై డీజిల్‌ పోసి నడి రోడ్డుపైనే నిప్పంటించాడు. ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అటు బేకరి నిర్వాహకులను, ట్రాక్టర్‌ యజమానిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Dec 14 , 2023 | 12:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising