ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గిట్టుబాటు ధర కల్పించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:44 PM

ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు పొలంలోనే నిరసనకు దిగారు.

పొలంలోనే ఉల్లి రైతుల నిరసన

కోసిగి, డిసెంబరు 17: ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు పొలంలోనే నిరసనకు దిగారు. పది రోజుల క్రితం గిట్టుబాటు ధర లభించటంతో సంతోషం వ్యక్తం చేసిన రైతులు నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఆదివారం కోసిగిలోని పులికనుమ ప్రాజెక్టు సమీపంలోని రైతులు కొండగేని వీరారెడ్డి, ఎరిగేరి సిద్ధయ్య, కురువ ఈరమ్మ, బుల్లి లక్ష్మన్న, అల్లయ్య ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా రైతులు తమ పొలాల్లోనే నిరసన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశామని, పది రోజుల క్రితం క్వింటం ధర రూ.4,500 ఉండేదని, నాలుగు రోజుల నుంచి క్వింటం రూ.1,600 నుంచి రూ.1,800కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల దాకా ఖర్చు పెట్టామని, గిట్టుబాటు ధర కల్పించకపోతే అప్పులే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్వింటానికి రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising