ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీకి గుణపాఠం తప్పదు: టీడీపీ

ABN, Publish Date - Dec 24 , 2023 | 12:21 AM

నియంత పాలన కొనసాగిస్తున్న వైసీపీకి ప్రజల నుంచి గుణపాఠం తప్పదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.

డోన్‌లో టీడీపీలో చేరిన కొత్తబురుజు వైసీపీ కార్యకర్తలు

డోన్‌, డిసెంబరు 23: నియంత పాలన కొనసాగిస్తున్న వైసీపీకి ప్రజల నుంచి గుణపాఠం తప్పదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శపివానం కొత్తబురుజు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చలపతి, రంగస్వామి, రమణ, కృష్ణ, రవికుమార్‌, మల్లన్న, మల్లికార్జున, లక్ష్మన్న, కదిరి వెంకటప్ప, పింజరి ఫకీరా, సుధాకర్‌తో పాటు మరో 40 కుటుంబాలు ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మల్లెల రాజశేఖర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, వలసల రామకృష్ణల సమక్షంలో టీడీపీలో చేరారు. మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ పాలనలో స్కాములు తప్ప ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. వైసీపీ పాలనలో భూమాఫియా, ఇసుక, మధ్యం మాఫియాలు చెలరేగిపోతూ ప్రజలను దోచేస్తున్నారనీ మండిపడ్డారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్‌ రెడ్డి పాలనలో రైతులకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు. వై.నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లా డుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. నాయకులు శ్రీనివాసులు యాదవ్‌, మిద్దెపల్లి గోవిందు, రామ్మోహన్‌ యాదవ్‌, కోదండ రామయ్య యాదవ్‌, కాశీవిశ్వనాథ్‌, మాజీ సర్పంచ్‌ వెంకట్రాముడు, నాగేష్‌, వీరన్న, చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising