ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దేశ సేవకు యువత ముందుకు రావాలి

ABN, Publish Date - Dec 30 , 2023 | 12:29 AM

: దేశం కోసం పోరాడిన వీరజవానుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు యువత ముందుకు రావాలని కల్నల్‌, గ్రూపు కమాండర్‌ సవ్యసాచి దాస్‌ పిలుపునిచ్చారు.

బోట్‌ సెయిలింగ్‌లో శిక్షణ పొందుతున్న ఎన్‌సీసీ కేడెట్లు

దేశ సేవకు యువత ముందుకు రావాలి

ట్రైనింగ్‌ క్యాంప్‌లో కల్నల్‌, గ్రూపు కమాండర్‌ సవ్యసాచి దాస్‌ పిలుపు

పటమట, డిసెంబరు 29 : దేశం కోసం పోరాడిన వీరజవానుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవకు యువత ముందుకు రావాలని కల్నల్‌, గ్రూపు కమాండర్‌ సవ్యసాచి దాస్‌ పిలుపునిచ్చారు. ఎన్‌సీసీ, 8 ఆంధ్రా నేవల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో యాన్యువల్‌ ట్రైనింగ్‌ క్యాంపు ఈ నెల 25న మధురానగర్‌ కేంద్రీయ విద్యాలయంలో ప్రారంభమైందని, జనవరి 3వరకు కొనసాగుతుందని విజయవాడ 8 ఆంధ్ర నేవల్‌ యూనిట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌. శ్రీనివాసరావు తెలియజేశారు. కేంద్రీయ విద్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి కల్నల్‌, గ్రూపు కమాండర్‌ సవ్యసాచి దాస్‌ మాట్లాడారు. అనంతరం క్యాంపు కార్యాలయం, క్యాంప్‌లో కేడెట్స్‌ చేసిన ఏర్పాట్లను, క్యాంప్‌ శిక్షణ అంశాలను ఆయన పరిశీలించారు. కమాండింగ్‌ ఆఫీసర్‌, కెప్టెన్‌ ఆర్‌. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్‌సీసీ కేడెట్లకు ఈ క్యాంప్‌లో బోట్‌ పుల్లింగ్‌, షిప్‌ మోడలింగ్‌, సెయిలింగ్‌, నావిగేషన్‌, కమ్యూనికేషన్‌, డ్రిల్‌, ఫైరింగ్‌, స్పోర్ట్స్‌ గేమ్స్‌, కల్చరల్‌తో పాటు, కామన్‌ సబ్జెక్ట్స్‌ పర్సనాలిటీ డెవలెప్‌మెంట్‌, లీడర్‌ షిప్‌ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ క్యాంప్‌లో ఎన్‌సీసీ కేడెట్స్‌ బాలురు, బాలికలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌టీ డాక్టర్‌ పరమేశ్వరరావు, సబ్‌ ఎల్‌టీవెంకటేష్‌, సబ్‌ ఎల్‌టీ స్వప్న, ఫ్లయింగ్‌ ఆఫీసర్స్‌ డాక్టర్‌ జాన్సన్‌ కిషోర్‌, డాక్టర్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:29 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising