టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం
ABN, Publish Date - Dec 23 , 2023 | 01:00 AM
టీడీపీ అధికా రంలోకి రాగానే అంగన్వాడీల జీతాల సమ స్యలు పరిష్కరిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.
అంగన్వాడీలకు సంఘీబావం తెలుపుతున్న కొల్లు రవీంద్ర
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ
మచిలీపట్నం టౌన్: టీడీపీ అధికా రంలోకి రాగానే అంగన్వాడీల జీతాల సమ స్యలు పరిష్కరిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. శుక్రవారం మచిలీపట్నం ధర్నాచౌక్‌లో నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. 11 రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. అంగన్వాడీల జిల్లా సంఘ నాయకురాలు రమాదేవి, బందరు ప్రాజెక్టు సంఘ కార్యదర్శి రెజీనారాణి, నాంచారమ్మ పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2023 | 01:00 AM