ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్ల విచారణ..హైడ్రామా

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:06 AM

బోగస్‌ ఓట్లపై టీడీపీ, వైసీపీ నాయకుల పరస్పర ఫిర్యాదులపై విచారణకు రావాలని నోటీ సులు ఇచ్చిన వీరులపాడు తహసీల్దార్‌ ఆశయ్య నాయక్‌ శనివారం హైడ్రా మాకు తెరదీశారు. విచా రణకు రమ్మనమని చెప్పి.. అందుబాటులో లేకుండా పోయారు.

ఆర్డీవో సాయిబాబుకు సాక్ష్యాలు అందిస్తున్న టీడీపీ నాయకులు

విచారణకు నోటీసులిచ్చి పత్తాలేకుండా పోయిన వీరులపాడు తహసీల్దార్‌

గంటల సేపు ఫోన్లకు దొరకని వైనం..చివరకు డీటీకి సాక్ష్యాలు ఇవ్వాలని సూచన

అభ్యంతరాలు స్వీకరించటానికి సమ్మతించినా రశీదు ఇవ్వడానికి డీటీ ససేమిరా

తంగిరాల సౌమ్యకు టీడీపీ నేతల ఫిర్యాదు..ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు సౌమ్య ఫిర్యాదు

ఆర్డీవోకు కలెక్టర్‌ ఫోన్‌..అభ్యంతరాలు, సాక్ష్యాలను స్వీకరించి రశీదిచ్చిన ఆర్డీవో

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వీరులపాడు): బోగస్‌ ఓట్లపై టీడీపీ, వైసీపీ నాయకుల పరస్పర ఫిర్యాదులపై విచారణకు రావాలని నోటీ సులు ఇచ్చిన వీరులపాడు తహసీల్దార్‌ ఆశయ్య నాయక్‌ శనివారం హైడ్రా మాకు తెరదీశారు. విచా రణకు రమ్మనమని చెప్పి.. అందుబాటులో లేకుండా పోయారు. ఫోన్లలోనూ అందుబాటులోకి రాకుండా టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టారు. చివరకు ఆయన లైన్‌ దొరికితే ఆఫీసులో డీటీకి అభ్యంత రాలు, సాక్ష్యాలు ఇచ్చి వెళ్లమని చెప్పారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను బోగస్‌ ఓట్లుగా నిరూ పించే సాక్ష్యాలు ఒక్కటి కూడా ఫిర్యాదు చేసిన వైసీసీ నాయకుల దగ్గర లేవు. దీంతో శనివారం వైసీపీకి చెందిన వారెవరూ విచారణకు రాలేదు. కేవలం టీడీపీ స్థానికనాయకులు, ఓటర్లు మాత్రమే విచారణకు వచ్చారు. వైసీపీకి చెందిన వారు రాకపోవటంతో .. టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు సాధ్యం కనుక తహసీల్దార్‌ గైర్హాజరయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టీడీపీ నేతల దగ్గర అన్ని ఆధారాలు

టీడీపీ నాయకుల దగ్గర వైసీపీకి సంబంధిం చిన బోగస్‌ ఓటర్ల ఆధారాలన్నీ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఓట్లు, వీటికి సంబంధిం చిన సాక్ష్యాలను టీడీపీ నాయకులు సేకరించారు. వాటని అందిస్తారన్న ఉద్దేశ్యంతోనే తహసీల్దార్‌ అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులు వస్తే వారిచ్చే ఆధారాలను స్వీకరించాలని డిప్యూటీ తహసీల్దార్‌, బీఎల్వోలకు చెప్పారు. టీడీపీ నాయకులు డీటీని కలిశాక డిక్లరేషన్‌ రాసి ఇవ్వమని అడిగారు. రశీదు ఇవ్వడానికి తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది నిరా కరించారు. అభ్యంతరాలు, సాక్ష్యాలు స్వీకరించి, రశీదు ఇస్తే వైసీపీకి చెందిన బోగస్‌ ఓట్లను తొల గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని రశీధు ఇవ్వ వద్దని తహసీల్దారే సిబ్బందికి నిర్దేశించినట్టుగా తెలుస్తోంది. రశీదు ఇవ్వకపోతే ఎవరి నుంచి అభ్యంతరాలు రాలేదని చెప్పి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించి, వైసీపీ బోగస్‌ ఓట్లను యథాతథంగా ఉంచేయడానికి ఈ పనిచేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ నాయకులు నందిగామ ఇన్‌చార్జి తంగిరాల సౌమ్య దృష్టికి తీసు కువచ్చారు. ఆమె వెంటనే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ దిల్లీరావుకు ఫోన్‌ చేసి అభ్యంతరాల స్వీకర ణలో తమ నాయకులకు ఎదురవుతున్న ఇబ్బం దులపై ఫిర్యాదు చేశారు. నందిగామ ఆర్డీవో సాయిబాబుకు కలెక్టర్‌ ఫోన్‌ చేసినట్టుగా తెలు స్తోంది. దీంతో ఆర్డీవో వచ్చి టీడీపీ నాయకుల నుంచి అభ్యంతరాలు, సాక్ష్యాలను స్వీకరించి రశీదు ఇచ్చారు.

అభ్యర్థనలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం: ఆర్డీవో

వీరులపాడు: కొత్త ఓటర్లను నమోదు చేయడంతో పాటు మల్టిఫుల్‌ ఓటర్లను గుర్తించి వాటిని తీసివేయడానికి రెవెన్యూ యంత్రాం గాన్ని సజావుగా నిష్పక్షపాతంగా నడిపిస్తామని నందిగామ ఆర్డీవో పి.సాయిబాబు తెలిపారు. పెద్దాపురంలో సుమారు 100 మంది ఓటర్లకు తహసీల్దార్‌ బి.ఆశయ్య ఫాం-14 నోటీసులు జారీచేశారు. వారిలో 25 మంది ఓటర్లు టీడీపీ పెద్దాపురం గ్రామ నాయకుడు నిమ్మల రాజేం ద్ర ఆధ్వర్యంలో ఆధారాలతో సహా జుజ్జూరు లోని తహసీల్దార్‌ కార్యాలయంలో శనివారం ఆర్డీవో నిర్వహించిన విచారణకు వారివద్ద ఉన్న అడ్రస్‌ఫ్రూప్‌లతో హాజరయ్యారు. తమకు ఎక్కడా ఓటు లేదని, బతుకుదెరువు నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిపారు. అడ్రస్‌ ఫ్రూఫ్‌లు మొత్తం పెద్దాపురంలో ఉన్నాయని విచారణ చేసుకోవచ్చని వివరించారు. వారి అభ్యర్థనలను పరిశీలించి తగు చర్యలు తీసు కుంటామని ఆర్డీవో తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 01:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising