విద్యాదీవెన నాలుగో విడత లబ్ధి
ABN, Publish Date - Dec 30 , 2023 | 01:06 AM
జగనన్న విద్యాదీవెన నాలుగోవిడత లబ్ధిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భీమవరంలో శుక్రవారం ప్రారంభించారు. ఎన్టీఆర్‌జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.దిల్లీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
కృష్ణలంక, డిసెంబరు 29 : జగనన్న విద్యాదీవెన నాలుగోవిడత లబ్ధిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భీమవరంలో శుక్రవారం ప్రారంభించారు. ఎన్టీఆర్‌జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.దిల్లీరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ మెగా చెక్కును విద్యార్థులకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థిక సమస్యలు పేద పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ టి.జమలపూర్ణమ్మ, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, గౌడ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కూరపాటి గీతాంజలి, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బీవీ విజయభారతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యాదీవెన చెక్కు అందజేస్తున్న కలెక్టర్, అధికారులు
కృష్ణా జిల్ల్లాలో రూ.22.20 కోట్లు విడుదల
మచిలీపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : విద్యాదీవెన పథకాన్ని సద్వినియోగం చేసుకుని పేదవిద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. విద్యాదీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాలునుంచి కలెక్టర్ తదితరులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్ల్లాలో 27606మంది విద్యార్థులకు విద్యాదీవెన పథకం ద్వారా రూ.22.20కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, ముడా చైర్‌పర్సన్ బొర్రా దుర్గాభవానీ, డెప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, సాంఘికసంక్షేమశాఖ డీడీ షాహిద్‌బాబు, గిరిజన సంక్షేమశాఖ అధికారి ఫణిధూర్జటి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారిణిపై వేటు
గుడివాడ, డిసెంబరు 29 : గుడివాడ డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారిణి డి.విజయలక్ష్మిని రాష్ట్ర కో-ఆపరేటివ్ కమిషనర్ బాబు.ఎ శుక్రవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమె వ్యవహార శైలిపై అందిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లా కో-ఆపరేటివ్ అధికారి వీవీ ఫణికుమార్ శుక్రవారం డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.
Updated Date - Dec 30 , 2023 | 01:06 AM