ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వెలంపల్లీ..నోరు అదుపులో పెట్టుకో

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:59 AM

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి తప్పదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ హెచ్చరించారు.

లేకుంటే దేహశుద్ధి తప్పదు..చంద్రబాబుకు సవాల్‌ విసిరే స్థాయా నీది?

దుర్గగుడిలో సింహాల ప్రతిమల చోరీపై చర్చకు సిద్ధమా?: టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌

వన్‌టౌన్‌, డిసెంబరు 25: ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే దేహశుద్ధి తప్పదని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్‌ హెచ్చరించారు. సోమవారం వన్‌టౌన్‌లోని టీడీపీ నాయకుడు ఫతావుల్లా కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ఎమ్యెల్యే వెలంపల్లి అవినీతి బాగోతమంతా తమ వద్ద ఉందని, వైసీపీ చీటి చినిగిపోతుండడంతో వెలంపల్లి పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడని రాకేశ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు సవాల్‌ విసిరేస్థాయి వెలంపల్లిది కాదని, చంద్రబాబుపై చేసిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని తెలిపారు. స్థలం, సమయం చెబితే తాము చర్చకు వస్తామని, పోలీసు లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తానంటే కుదర దని చిత్తశుద్ధి ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని సూచించారు. పేద మధ్యతరగతి ఆర్యవైశ్యులు చేసు కునే వనసమారాధనను వ్యవస్థలతో అడ్డుకున్న చరిత్రహీనుడు వెలంపల్లి అని విమర్శించారు. దేవదా యశాఖ మంత్రిగా ఉన్నపుడు దుర్గగుడి వెండి రథం లోని మూడు సింహాల ప్రతిమల చోరీపై వాస్తవాలు చెప్పేందుకు, అక్రమ ఆస్తులు, అక్రమాలపై చర్చించేం దుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 07:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising