ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2023-12-03T00:33:49+05:30

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా విద్యా ప్రమాణాలు ఎలా మెరుగు పడతాయని కృష్ణా -గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రశ్నించారు.

జిల్లా మహాసభల్లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు

జగ్గయ్యపేట, డిసెంబరు 2: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేయకుండా విద్యా ప్రమాణాలు ఎలా మెరుగు పడతాయని కృష్ణా -గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రశ్నించారు. పట్టణంలో విశాఖ ఉక్కు భవన్‌లో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ బకాయిలు విడుదల చేయాలన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాలను ప్రతి ఒక్క విద్యార్థికి అందించాలని డిమాండ్‌ చేశారు. నాడు - నేడు పనులు పూర్తి చేయాలని, వీఎస్పీ ప్రైవేటీకరణను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్‌ చే శారు. పెరిగిన ధరలకు అను గుణంగా సంక్షేమ హాస్టళ్ల మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీకళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా విధానం సర్వనాశనమైపోయిందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటి సభ్యులు ఎం.సోమేవ్వరరావు, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

మహాసభ ప్రారంభం సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి బలుసుపాడు జంక్షన్‌ వరకు ర్యాలీ చేశారు. అనంతరం విశాఖ ఉక్కు భవన్‌లో బహిరంగ సభ నిర్వహించారు.

Updated Date - 2023-12-03T00:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising