వైసీపీ పాలనలో..అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకంజ
ABN, First Publish Date - 2023-12-11T01:00:51+05:30
వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
టీడీపీని గెలిపించుకుందాం..రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం..ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపు
పటమట, డిసెంబరు 10: వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆది వారం 10వ డివిజన్ కేవీనగర్‌లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేపీనగర్‌లో ఓటర్ల పరిశీలనలో పాల్గొన్నారు. ‘‘జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అభి వృద్ధి నిలిచిపోయింది. ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి కానరావడం లేదు. ఇసుక లేక నిర్మాణ రంగం కుదేలైంది. నిర్మాణ రంగంలో పనులు లేకపోవ డంతో సిమెంట్, ఇటుక, స్టీలు విక్రయాలు పెద్దగా లేవు. నిర్మాణరంగంపై ఆధా రపడిన వారికి జీవనోపాధి కరువైంది. రాజధానిని తరలిస్తామని చెప్పడంతో అమరావతి పరిధిలోని ఆటోడ్రైవర్లకు కిరాయిలు లేవు. దుకాణాల్లో వ్యాపారాలు లేవు. నగరంలో చాలా చోట్ల ఇల్లు అద్దెకు ఇవ్వబడును బోర్డులు దర్శన మిస్తున్నాయి.’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేటర్ దేవినేని అపర్ణ, సుంకర వీరభద్రరావు, చలసాని వాసు, శివరామకృష్ణ, దాసరి రామకృష్ణ, వల్లభ నేని మాధవి, హిమాదేవి, రోజా, గోపాలరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-11T01:00:52+05:30 IST