రెండు ద్విచక్రవాహనాలు ఢీ..
ABN, Publish Date - Dec 23 , 2023 | 12:56 AM
జాతీయ రహ దారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహ నాలు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలు
మోపిదేవి, డిసెంబరు 22: జాతీయ రహ దారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహ నాలు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పెదప్రోలు శివారు కాసానగర్ వద్ద శుక్రవారం జరిగింది. ఏలూరుకు చెం దిన కట్టా ఫణి ద్విచక్ర వాహనంపై మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి విచ్చేశారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా, కాసానగర్ వద్ద ఎదు రుగా వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఫణిని 108లో చల్లపల్లి ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. మరో ద్విచక్ర వాహన దారుడు మహేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మోపిదేవి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Dec 23 , 2023 | 12:56 AM