ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సమ్మెలోకి..
ABN, Publish Date - Dec 29 , 2023 | 01:19 AM
పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శనను గురువారం నిర్వహించారు.
తిరువూరు, డిసెంబరు 28: పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శనను గురువారం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేప ట్టారు. ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి ఫ్యాక్టరీ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. నిరసన దీక్షలో పాల్గొన్న పారిశుధ్యం కార్మికులకు టీడీపీ నాయకుడు కేశినేని శివనాథ్(చిన్ని), టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్ మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా కార్మికులకు భోజనం అందించారు.
బలుసుపాడు జంక్షన్‌లో..
జగ్గయ్యపేట: తమ డిమాండ్ల సాధనకు మూడు రోజులగా సమ్మె చేస్తున్న మునిసిపల్ పారిశుధ్య కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు బుధవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింద ని వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బలుసుపాడు జంక్షన్ వరకు ప్రదర్శన జరిగింది.
Updated Date - Dec 29 , 2023 | 01:19 AM