ఆట.. ఓట్ల వేట!
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:12 AM
ముందున్నది ఎన్నికల సీజన్.. ఆడుదాం-ఆంధ్రా పేరుతో క్రీడా కిట్‌లు, నగదు బహుమతులతో యువత ఓట్లను అనుకూలంగా మలచుకోవడానికే వైసీపీ ప్రభుత్వం ఈ ఆడుదాం-ఆంధ్రాకు పూనుకుందా.. అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల పైబడిన వారి పేర్లు మాత్రమే నమోదు చేయించగా.. ఇప్పటికే 20 మండలాలు, పట్టణాల పరిధిలోని సచివాలయాల క్రీడాకారులకు కిట్‌ల పంపిణీ పూర్తయింది. గ్రామ, మండల, జిల్లాస్థాయి దాటి రాష్ట్రస్థాయిలో పోటీ పడే క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేస్తారని చెబుతున్నా.. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వస్తే స్కీమ్ క్లోజ్ అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముందున్నది ఎన్నికల సీజన్.. ఆడుదాం-ఆంధ్రా పేరుతో క్రీడా కిట్‌లు, నగదు బహుమతులతో యువత ఓట్లను అనుకూలంగా మలచుకోవడానికే వైసీపీ ప్రభుత్వం ఈ ఆడుదాం-ఆంధ్రాకు పూనుకుందా.. అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల పైబడిన వారి పేర్లు మాత్రమే నమోదు చేయించగా.. ఇప్పటికే 20 మండలాలు, పట్టణాల పరిధిలోని సచివాలయాల క్రీడాకారులకు కిట్‌ల పంపిణీ పూర్తయింది. గ్రామ, మండల, జిల్లాస్థాయి దాటి రాష్ట్రస్థాయిలో పోటీ పడే క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేస్తారని చెబుతున్నా.. ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వస్తే స్కీమ్ క్లోజ్ అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఆటలు యువతను ఏమాత్రం ఆకర్షిస్తాయో వేచి చూడాల్సిందే.
విజయవాడ స్పోర్ట్సు, డిసెంబరు 25 : గ్రామీణ, పట్టణాల్లో కిందిస్థాయి నుంచి క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం-ఆంధ్రా కార్యక్రమం ఎట్టకేలకు మంగళవారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెలలోనే క్రీడల నిర్వహణకు శ్రీకారం చుట్టగా అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తామని, గైడ్‌లైన్స్ ఆలస్యం కావడంతో డిసెంబరు 15కు, క్రీడాకారులు నమోదు కాకపోవడం, తుపాను కారణంగా రిజిస్ర్టేషన్ రెండు రోజులు పెంచడం ఎట్టకేలకు ఈ నెల 26వ తేదీని ఖరారు. ప్రజాప్రతినిధులు, స్థానిక పీఈటీల సహకారం లేకుండా కేవలం వలంటీర్లతోనే నడిపించడంతో ప్రజల్లో స్పందన రాకపోవడం, క్షేత్రస్థాయిలో ప్రచారలోపం కనిపిస్తోంది. ఆడుదాం- ఆంధ్రాకు రూ.100 కోట్లకుపైనే ఖర్చు చేస్తున్నారు. నిధులను 26 జిల్లాలకు కేటాయించి స్టేడియాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే క్రీడలకు శాశ్వత మేలు జరిగేదన్న వ్యాఖ్యానాలు వినవపస్తున్నాయి.
లక్ష్యం చేరని క్రీడాకారుల నమోదు
ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలు, పట్టణాల పరిధిలోని 605 సచివాలయాలలో ఫిభ్రవరి 26వరకు (47రోజులు) క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, వాలీబాల్‌తో పాటు స్ధానిక ప్రాధాన్యమున్న క్రీడాపోటీలను వలంటీర్లు నిర్వహించనున్నారు. జిల్లాలో 1.37లక్షలు లక్ష్యంగా కాగా కేవలం లక్షా 17వేల మంది పేర్లను నమోదు చేసుకున్నారు. క్రీడల నిర్వహణకు 225 మైదానాలను సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సచివాలయాల పరిధిలో వలంటీర్లు క్రీడాకారులను చేర్చేందుకు అష్టకష్టాలు పడ్డారు. తీరా మైదానంలో ఎంతమంది ఆడతారనేది ప్రశ్నార్థకమే. క్రీడాంశాల పేరుతో భారీగా బడ్జెట్‌ను కేటాయించి ఖర్చు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఆటల పోటీలకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నిర్వహించే ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌ఏ అజీజ్ తెలిపారు. నగరంలో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రజాప్రతినిధులు, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పోటీలు ప్రారంభిస్తారన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 12:12 AM