ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్వాడీల డిమాండ్లు ఆమోదించాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:14 AM

అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమో దించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు.

బందరు ధర్నాచౌక్‌ శిబిరానికి వెళ్లి కొల్లు రవీంద్ర సంఘీభావం

టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తాం :కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 16: అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమో దించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. ధర్నాచౌక్‌ వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న సమ్మె ఐదో రోజుకు చేరిన సందర్భంగా ధర్నా శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా అంగన్వాడీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచు తామని వాగ్దానం చేసిన జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లయినా పట్టించుకోలేదని, తెలంగాణ కంటే రూ.1000 వేతనం అధి కంగా ఇస్తామని అధికారంలోకి వచ్చారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సమ్మె చేస్తున్న సమయంలో అంగన్వాడీ కేం ద్రాల తాళాలు పగలకొట్టి తెరిపించడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, తెలుగుమహిళ పట్టణ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ, కుంచే నాని తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు బేబిరాణి, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నియోజకవర్గ అధ్యక్షురాలు రెజీనా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ చిత్రపటానికి కొల్లు రవీంద్ర, కొనకళ్ల బుల్లయ్య తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.

అంగన్వాడీలను వంచించిన జగన్‌: నెట్టెం

నందిగామ రూరల్‌: నాలుగున్నరేళ్లు సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్‌ వంచించారని టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘు రాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నందిగామలో అంగన్వాడీ కార్య కర్తలు చేస్తున్న ఆందోళనలో శనివారం కార్యకర్తలు నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. కార్యకర్తల ఆందోళనకు నెట్టెం మద్దతు తెలిపారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న కార్యకర్తల సమస్యలు పట్టించుకోకుండా, బలవంతంగా, దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించటం దారుణమని నెట్టెం ఆగ్రహం వ్యక్తంచేశారు. మహి ళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు కనీసం నోరు మెదపకపోవ టం శోచనీయమన్నారు. టీడీపీ హయాంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించటమే కాకుండా, కార్యకర్తలకు చంద్రబాబు అండగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్‌ నాయకులు హెచ్చరించారు.

అంగన్వాడీలపై కక్షసాధింపు దుర్మార్గం: బొండా ఉమా

ధర్నాచౌక్‌: ‘‘ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గం. తెలంగాణకంటే ఎక్కువ జీతాలు ఇస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి, మాట తప్పిన సీఎం జగన్‌ను అంగన్వాడీలు ప్రశ్నించడం తప్పా? అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టే అధికారం ఎవరిచ్చారు. అంగన్వాడీలకు జీతాలు పెంచిన ఘనత చంద్రబాబుదే.’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. అంగన్వాడీల న్యాయబద్ధమన డిమాండ్లను తక్షణమే ఆమోంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు చేస్తున్న ధర్నా శిబిరాన్ని సందర్శించి శనివారం టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. డిమాండ్లను ఆమో దించే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని అం గన్వాడీలు స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆచంట సునీత పాల్గొన్నారు.

ఐదోరోజుకు సమ్మె

మచిలీపట్నం, డిసెంబరు 16(ఆంధ్ర జ్యోతి): కృష్ణాజిల్లావ్యాప్తంగా అంగన్వాడీవర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మె శనివారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద చేస్తున్న ఆందోళనకు మాజీమంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య తదిత రులు సంఘీభావం తెలిపారు. మొవ్వ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అవనిగడ్డలో అంగన్వాడీల దీక్షకు జనసేన నాయకులు రాయపూడి వేణుగోపాలరావు, మత్తి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. గుడివాడలో ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. తమ డిమాండ్లు ఆమోదించేంత వరకు సమ్మెను విరమిం చేదిలేదని నినాదాలు చేశారు. కంకిపాడు ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు టీడీపీ నాయకులు దేవినేని గౌతం, స్మిత, జనసేన నాయకులు పులి కామేశ్వరరావు, గడ్డం నెహ్రూ తదితరులు సంఘీ భావం తెలిపారు.

సమ్మెకు బాధ్యత ప్రభుత్వానిదే: పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

గన్నవరం: అంగన్వాడీల సమ్మెకు ప్రభుత్వానిదే బాధ్యత అని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తాను అన్నట్టుగా జగన్‌ పాలన ఉందని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు విమర్శించారు. ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల ధర్నా శిబిరానికి శని వారం లక్ష్మణరావు వచ్చి సమ్మెకు మద్దతు తెలిపారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని అంగన్‌వాడీలు ప్రభు త్వతీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం జగన్‌ కార్మికులకు హామీలు నెరవేర్చకపోగా ప్రజా ఉద్యమాలను పోలీసులతో అణచివేయాలని చూస్తు న్నారని లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలం గాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ వేతనం ఇస్తామని చెప్పి ఆచరణలో విస్మరించారన్నారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాం డ్‌ చేస్తున్నాయన్నారు. వేతనాలు పెంచకపోగా ప్రస్తుతం పనిభారం పెరిగి అంగన్‌వాడీ కార్మికులు అల్లాడిపోతున్నారన్నారు. యాప్‌లు తీసుకువచ్చి ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు రమాదేవి, వై.నరసింహారావు, కళ్లం వెంకటేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి, కడవ కొల్లు రామరాజు, మల్లవల్లి సాంబశివరావు, మరీదు వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 01:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising