విగ్రహాల తొలగింపులో ఉద్రిక్తత
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:57 AM
ముక్త్యాల గ్రామంలో శనివారం విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది.
జగ్గయ్యపేట రూరల్, డిసెంబరు 30: ముక్త్యాల గ్రామంలో శనివారం విగ్రహాల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు ఏర్పాటు చేసిన స్థలంలో రాత్రికి రాత్రే ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయటంతో దానిని ఆసరాగా చేసుకున్న కొందరు జెండాలు, మరోవర్గం ఎరుకుల నాంచారమ్మ, మైసమ్మ, అంబేడ్కర్, ఏకలవ్య చిత్ర పటాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో పోటాపోటీగా సామాజిక వర్గాలు విగ్రహాలు ఏర్పాటు చేయటంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతుందనే సమాచారంతో శనివారంపోలీస్, రెవెన్యూ, పంచాయతీ అధికారులు రంగంలోకి దిగి విగ్రహాలను తొలగించారు. ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఆ స్థలంలో పురాతన కాలం నుంచి అమ్మవారి గుడి ఉందని, స్థలం కేటాయిస్తామని చెబుతున్నారు కానీ నేటికి ఇవ్వలేదన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అర్జీ దాఖలు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:57 AM