ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలు..

ABN, First Publish Date - 2023-01-02T14:05:44+05:30

అమరావతి: చంద్రన్న కానుక (Chandranna Kanuka) ఓ ఎన్నారై సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని, పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చంద్రన్న కానుక (Chandranna Kanuka) ఓ ఎన్నారై (NRI) సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమమని, పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ముందుగానే వచ్చి సభా స్థలాన్ని పరిశీలించారని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ దుర్ఘటన ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఆ ముగ్గురు చనిపోయారా? లేక వారిని చంపేశారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆ కుట్ర కోణాన్ని సీఎం జగన్‌ (CM Jagan) బహిర్గతం చేయాలన్నారు. వాళ్లను సీఎం, ఆయన పార్టీ నేతలు కలిసి చంపేశారని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) సభలకు ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారని, ఇదంతా వైసీపీ స్లీపర్‌ సెల్స్‌ చేస్తున్న కుట్రలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

చంద్రబాబు తన ప్రసంగం ముగించుకుని అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ ఘటన జరిగిందని వర్ల రామయ్య అన్నారు. నిన్న గుంటూరు (Guntur) సభలో అధికార పార్టీ స్లీపర్ సెల్స్ (Sleeper Cells) ఉన్నారనే అనుమానం ఉందన్నారు. గుంటూరు సభలో తొక్కిసలాట జరుగుతుందని ముందే సీఎం, వైసీపీ (YCP) నేతలకు తెలుసునని, చంద్రబాబు సభలకు జనం లేకుండా చేయడానికి వైసీపీ ఆడిన కుట్ర అని అన్నారు. వైసీపీ వాళ్లకు ముగ్గురు చనిపోతారని ముందే తెలుసు కాబట్టి ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో మంత్రులు వరుస క్రమంలో హాస్పిటల్ దగ్గరికి వచ్చారన్నారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే గుంటూరు ఘటనపై సీబీఐతో విచారించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-01-02T14:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising