ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటి నుంచి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:58 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.ఎస్‌.చక్రధరరావు తెలిపారు.

మోపిదేవి, డిసెంబరు 16: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.ఎస్‌.చక్రధరరావు తెలిపారు. శనివారం ఆలయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈవో మాట్లాడారు. ఈనెల 18న సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శంకు స్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. ఉదయం స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా దేవదాయ శాఖ తరఫున స్వామికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. జాతీయరహదారి నుంచి మోపిదేవి దేవాల యం వైపు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం, ప్రధాన గ్రామంలో డ్రెయినేజీ నిర్మాణ పనులు, ఆధునీకరణ చేసిన కోనేరు ప్రారంభి స్తారని, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 12:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising