వ్యక్తిగత ఆరోగ్యంపై విద్యార్థినులు శ్రద్ధ చూపాలి
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:00 AM
విద్యార్థినులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అను మైబేబీ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మాణిక్యపాలెపు పావని అన్నారు.
వ్యక్తిగత ఆరోగ్యంపై విద్యార్థినులు శ్రద్ధ చూపాలి
గైనకాలజిస్ట్ డాక్టర్ మాణిక్యపాలెపు పావని
వన్‌టౌన్, డిసెంబరు 16: విద్యార్థినులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అను మైబేబీ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మాణిక్యపాలెపు పావని అన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు సాంకేతిక ఇంజనీరింగ్ కాలేజీలో సైన్స్, హ్యుమనిటీస్ ఆధ్వర్యంలో శనివారం మహిళల రుతు సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు అడిగిన పలు ప్రశ్నలకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పరిశుభ్రత, పౌష్టికాహారం, వ్యాయామం వంటి వాటి విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. మహిళల కోసం శానిటరీ డిస్పోజబుల్ మిషన్‌ను అందించినందుకు యాజమాన్యాన్ని అభినందించారు. విభాగాధిపతి డాక్టర్ ఏ రమాదే వి కార్యక్రమాన్ని నిర్వహించారు.
Updated Date - Dec 17 , 2023 | 01:01 AM