AP News: బెజవాడలో దారుణం.. ఎస్టీ పిల్లలకు గుండు కొట్టించిన బాల సదనం సిబ్బంది
ABN, First Publish Date - 2023-08-02T15:53:49+05:30
బెజవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదనం భవన్ సిబ్బంది గుండు కొట్టించారు. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
విజయవాడ: బెజవాడలో దారుణం జరిగింది. 9 మంది అనాధ ఎస్టీ పిల్లలకు బాల సదనం భవన్ సిబ్బంది గుండు కొట్టించారు. ఈ ఘటనపై బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల సదనంలో హక్కుల కమిషన్ పర్యటించి.. బాధిత బాలల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాల సదనం భవన్ సూపరింటెండెంట్, ఉమెన్ వేల్ఫేర్ అండ్ చైల్డ్ పీడీకి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది. ఈనెల 8న బాలల హక్కుల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Updated Date - 2023-08-02T15:53:49+05:30 IST