ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాకాని వర్ధంతి కార్యక్రమంలో వారసత్వ లొల్లి

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:21 AM

ఇదివరకు జరిగిందిదీ.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న దివంగత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని తొలగించారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి నేతృత్వంలో భారీగా ఆందోళన చేశారు. ఫలితంగా జిల్లా యంత్రాంగం కాకాని విగ్రహాన్ని పునఃప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చింది. తర్వాత కాకాని ఆశయ సాధన సమితి పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని వ్యవస్థాపక అధ్యక్షుడినంటూ తరుణ్‌ అనే వ్యక్తి ప్రకటించుకున్నాడు.

కాకాని విగ్రహానికి నివాళులర్పిస్తున్న కాకాని విజయ్‌కుమార్‌, యలమంచిలి రవి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

బెంజిసర్కిల్‌ విగ్రహం వద్దకు యలమంచిలి రవితో కాకాని విజయకుమార్‌, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కాకాని తరుణ్‌ ఒకేసారి నివాళులర్పించడానికి రాక

వెంకటరత్నం విగ్రహానికి నీకు ఏం సంబంధమని కాకాని తరుణ్‌ను ప్రశ్నించిన కాకాని వారసులు

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే విగ్రహదాతనని ప్రకటించుకున్నారని తరుణ్‌పై విజయ్‌కుమార్‌ ఆగ్రహం

ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో తరుణ్‌ను పంపేసిన పోలీసులు

పటమట, డిసెంబరు 25: దివంగత కాకాని వెంకటరత్నం వర్ధంతి సంధర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, కాకాని మనుమడు కాకాని విజయ కుమార్‌ వందల సంఖ్యలో కాకాని అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాకాని విగ్రహానికి నివాళులర్పించేందుకు బెంజిసర్కిల్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమ యంలో జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయ ణను వెంట బెట్టుకుని కాకానికి నివాళులర్పించేందుకు కాకాని తరుణ్‌ అక్కడికి చేరుకున్నారు. కాకాని విగ్రహానికి నివాళులర్పించడానికి నీవెవరు..నీకేం సంబంధం అంటూ కాకాని వారసులు తరుణ్‌ని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసు కుంది. పోలీసులు జోక్యం చేసుకుని తరుణ్‌ కాకానిని అక్కడ నుంచి పంపించి వేశారు. కాకాని మనుమడు కాకాని విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ దివంగత వెంకటరత్నం చరి త్రను ఆయన విలువను దిగజార్చే విధంగా కొందరు వ్యక్తిగత స్వార్థంతో వ్యవహరి స్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కాకాని అనుచరులు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో, ఎటువంటి సంబంధం లేని కాకాని తరుణ్‌ తన వ్యక్తిగత ప్రయోజనం కోసం వ్యవస్థను పూర్తిగా తప్పు పట్టించారని అన్నారు. విగ్రహ దాత తాను అని తరుణ్‌ ప్రకటించు కోవడం సిగ్గు చేటు అని, కాకాని విగ్రహం కోసం అప్పట్లో ఆయన అభిమానులు ఆర్థిక చేయూత నిచ్చారని, దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా కూడా ఆర్థిక సహాయం అందించారని విజయ్‌కుమార్‌ తెలిపారు.

విజయవాడ చరిత్రను మసకబార్చే కుట్ర: యలమంచిలి రవి

కాకాని విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో విజయవాడ చరిత్రను మసకబార్చే కుట్ర జరిగిందని, కాకాని కుటుంబ సభ్యులను పక్కన పెట్టి కార్యక్రమం నిర్వహించ డం, కొందరు దానికి వంతపాడేలా వ్యవహరించడాన్ని నగర ప్రజలు అర్ధం చేసుకున్నా రని, దీనిపై సమావేశం జరిపి త్వరలోనే మంచి నిర్ణయం తీసుకోబోతున్నామని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తెలిపారు. అనంతరం యలమంచిలి రవి ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాలడగు మాధవ కిషోర్‌, అక్కినేని బోసు, కనగాల నాగేశ్వరరావు, కలపాల వినయసాగర్‌, బి. ఇంద్రమోహన్‌రెడ్డి, చెన్నుపాటి గణేష్‌, రామాయాణపు సాంబయ్య, కాంగ్రెస్‌ నేత కొలనుకొండ శివాజీ, యలమంచిలి రాజీవ్‌, సుంకర రవి, రవి యూత్‌ సభ్యులు మోహన్‌, రేఖాబాబు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising