సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 28 , 2023 | 01:18 AM
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్‌చేసి సమానపనికి సమాన వేతనం, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరులో మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండవరోజు కొనసాగింది.
ఉయ్యూరు, డిసెంబరు 17 : కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్‌చేసి సమానపనికి సమాన వేతనం, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉయ్యూరులో మునిసిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం రెండవరోజు కొనసాగింది. సమ్మెలో ఉన్న కార్మికులకు మద్దతు తెలిపిన సీపీ ఎం జల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కోసూరి శివ నాగేంద్రం మాట్లాడుతూ, మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘో రంగా విఫలమైందన్నారు. పెరిగిన ధరలకను గుణంగా వేతనాలు పెరగక కార్మికుల జీవనం కష్టతరమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోపోవడం దుర్మార్గమని విమర్శించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి రాజేశ్, ఏపీ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఉయ్యూరు కమిటీ కార్యదర్శి వి చింత య్య, అధ్యక్షుడు రామయ్య, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, కమిటీ సభ్యులు దుర్గారావు, సుజాత, దుర్గమ్మ, పాపారావు, శివయ్య పాల్గొన్నారు.
Updated Date - Dec 28 , 2023 | 01:18 AM