ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంక్షోభంలో వ్యవసాయం

ABN, First Publish Date - 2023-12-03T00:58:41+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం సంక్షోభం లోకి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మండలంలోని కోల వెన్ను, పునాదిపాడు, తెన్నేరు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటిం చారు. కల్లాలు, మెరక ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యాన్ని, కాటా వేసి రవాణా కోసం ఎదురు చూస్తున్న రైతులను ఆయన పరామ ర్శించారు. వివరాలు అడిగి తెలుసుకు న్నారు.

కోలవెన్నులో ధాన్యం బస్తాలను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

రైతు భరోసా కేంద్రాలు కాదు.. వైసీపీ నాయకులకు ఆదాయ కేంద్రాలు.. అధికార పార్టీ నాయకులకు అధికారులు గులాం గిరి.. అధికారుల తీరుపై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆగ్రహం

కోలవెన్ను (కంకిపాడు), డిసెంబరు 2 : వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం సంక్షోభం లోకి వెళ్లిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ అన్నారు. మండలంలోని కోల వెన్ను, పునాదిపాడు, తెన్నేరు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటిం చారు. కల్లాలు, మెరక ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యాన్ని, కాటా వేసి రవాణా కోసం ఎదురు చూస్తున్న రైతులను ఆయన పరామ ర్శించారు. వివరాలు అడిగి తెలుసుకు న్నారు. ఆర్‌బీకే అధికారుల నిర్లక్ష్యంపై మం డిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు నెలల పాటు కష్టపడి, పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతాంగాన్ని ఆదుకో వడంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. లాభం పక్కన పెడితే పెట్టిన పెట్టుబడులు రాక రైతులు అప్పులపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా కేంద్రాలకు సంబంధించిన అధికారులు అధికార పార్టీ నాయకులకు గులాం గిరి చేస్తున్నారని మండిపడ్డారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా అందుకు అనుగుణంగా ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలకు జీపీఎస్‌ అంటూ, ఎక్కడా లేని ఆంక్షలు విధించి రైతులను నట్టేట ముంచుతుందని మండి పడ్డారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని, అందుకు అవసరమైన హమాలీలు, లారీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు తుమ్మల జగదీష్‌, చిట్టిబాబు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T00:58:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising