ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదంలో పెయింటర్‌ మృతి

ABN, Publish Date - Dec 26 , 2023 | 12:29 AM

రోడ్డు ప్రమాదంలో పెయింటర్‌ మృతి చెందినట్లుగా మాచవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కానూరుకు చెందిన కె.క్రాంతి కుమార్‌ (40) పెయింటింగ్‌ పనిచేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మదర్‌ థెరిస్సా జంక్షన్‌ వద్ద క్రాంతి కుమార్‌ ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.

గుణదల, డిసెంబరు 25: రోడ్డు ప్రమాదంలో పెయింటర్‌ మృతి చెందినట్లుగా మాచవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కానూరుకు చెందిన కె.క్రాంతి కుమార్‌ (40) పెయింటింగ్‌ పనిచేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మదర్‌ థెరిస్సా జంక్షన్‌ వద్ద క్రాంతి కుమార్‌ ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. కానూరుకు చెందిన క్రాంతికుమార్‌ తన స్నేహితుణ్ణి కలిసేందుకు సోమవారం సాయంత్రం గిరిపురానికి చేరుకున్నాడు. మొగల్రాజపురానికి చెందిన సాంబశివరావు బందర్‌రోడ్డు నుంచి సిద్థార్థ కళాశాల వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న క్రమంలో మథర్‌ థెరిస్సా జంక్షన్‌ వద్ద ఎదురుగా వస్తున్న క్రాంతి కుమార్‌ బలంగా ఢీకొట్టాడు. ఈఘటనలో క్రాంతి కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మాచవరం పోలీసులు గాయపడిన సాంబశివరావును 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి, క్రాంతి కుమార్‌ మృత దేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబసబ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచవరం సీఐ గుణరామ్‌ తెలిపారు.

Updated Date - Dec 26 , 2023 | 07:24 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising