ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దుర్గాఘాట్‌లో నదీ స్నానాలకు అనుమతి

ABN, First Publish Date - 2023-11-21T01:44:20+05:30

కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తుల స్నానాలకు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు సోమవారం నుంచి అనుమతించారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దుర్గాఘాట్‌లో స్నానమారిస్తున్న భక్తులు..

వన్‌టౌన్‌, నవంబరు 20 : కృష్ణానది దుర్గాఘాట్‌లో భక్తుల స్నానాలకు దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం అధికారులు సోమవారం నుంచి అనుమతించారు. దేవస్థానం స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాదశర్మ ఆధ్వర్యంలో దుర్గాఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు మూడేళ్ల క్రితం నుంచి దేవస్థానం అధికారులు ఈ ఘాట్‌లో భక్తుల స్నానాలు నిలిపివేసి జల్లుస్నానాన్ని ఏర్పాటు చేశారు. కొవిడ్‌ సందర్భంగా జల్లు స్నానాన్ని కూడా నిలిపివేశారు. 2022లో జల్లు స్నానాన్ని పునఃప్రారంభించారు. ఇటీవల దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి కృష్ణానదీ స్నానాలకు భక్తులను అనుమతించకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. సోమవారం దేవస్థానం స్థానాచార్యులు, అర్చకస్వాములు దుర్గాఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల స్నానాలకు అనుమతించారు.

కార్తీక మాస పూజలు..

కార్తీక తొలి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సహస్రలింగార్చన, రుద్రాభిషేకం, బిల్వార్చన, మంత్రపుష్పం, హారతి తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని పూజాధికాలను జరిపించారు.

దుర్గమ్మ సన్నిధిలో ప్రముఖులు..

దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో కనకదుర్గమ్మను సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం వారికి అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ దంపతులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దంపతులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-11-21T01:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising