ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణం ఉపసంహరించాలి : కొల్లు రవీంద్ర

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:28 AM

ప్రజల హక్కులను హరించే ఏపీ భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మహిళా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కొల్లు రవీంద్ర గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు.

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 21 : ప్రజల హక్కులను హరించే ఏపీ భూయాజమాన్య హక్కు చట్టాన్ని తక్షణమే ఉపసంహరించాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు. మహిళా న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కొల్లు రవీంద్ర గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, సివిల్‌ కోర్టు పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వ అధికారికి అప్పగించడం వల్ల న్యాయ వ్యవస్థ పవిత్రతను కోల్పోతుందన్నారు. మచిలీపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తుంగల హరిబాబు అధ్యక్షతన జరిగిన నిరసనలో కార్యదర్శి కొట్టె రఘురామ్‌, న్యాయవాది రజియా సుల్తానా, టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, పల్లపాటి సుబ్రహ్మణ్యం, లంకే హరికృష్ణ, లంకిశెట్టి నీరజ, పి.వి ఫణికుమార్‌, ఎండి ఇలియాస్‌ పాషా, పిప్పళ్ళ కాంతారావు, వక్కపట్ల శ్రీను, కుంచే నాని, పుప్పాల ప్రసాద్‌, కరెడ్ల సుశీల, ఆళ్ళ మాధవ, కార్పొరేటర్‌ దేవరపల్లి అనిత పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 12:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising