ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల ర్యాలీ

ABN, Publish Date - Dec 23 , 2023 | 12:59 AM

నందిగామ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్‌లో కార్మికులు మానవహారం నిర్వహించారు.

నందిగామలో ర్యాలీ చేస్తున్న కార్మికులు

నందిగామ రూరల్‌, డిసెంబరు 22 : నందిగామ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నందిగామ గాంధీ సెంటర్‌లో కార్మికులు మానవహారం నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం నుంచి ప్రదర్శనగా గాంధీసెంటర్‌కు చేరుకుని నిరసనలు తెలిపారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి. అజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబరు 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పారిశుఽధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.26 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చనుమోలు సైదులు, కటారపు గోపాల్‌, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:59 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising