స్ర్టాంగ్‌రూమ్‌లు సిద్ధం చేయండి
ABN, Publish Date - Dec 31 , 2023 | 01:40 AM
త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు గదులను సిద్ధం చేయాలని అధికారులను కృష్ణా కలెక్టర్ పి.రాజాబాబు ఆదే శించారు.
అధికారులకు కృష్ణా కలెక్టర్ రాజాబాబు ఆదేశం
మచిలీపట్నం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈవీఎంల భద్రత, ఓట్ల లెక్కింపునకు గదులను సిద్ధం చేయాలని అధికారులను కృష్ణా కలెక్టర్ పి.రాజాబాబు ఆదే శించారు. కృష్ణా యూనివర్సిటీలోని అంబేడ్కర్ అకడమిక్ బ్లాక్‌ను శనివారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను భద్రపరచడం, ఓట్ల లెక్కింపు కృష్ణా యూనివర్సిటీలో ఉంటుందని తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచే గదులను, కౌంటింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి ఎంపిక చేశారు. ఓట్ల లెక్కింపు రోజున వాహనాల పార్కింగ్‌కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. కలెక్టర్ వెంట కృష్ణా యూనివర్సిటీ వీసీ జి.జ్ఞానమణి, డీఆర్వో పెద్దిరోజా, ఆర్డీవో ఎం.వాణి, డీపీవో నాగేశ్వరనాయక్, మునిసిపల్ కమిషనర్ చంద్రయ్య, ఆర్ అండ్‌బీ ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీవిద్య, జిల్లా ఎన్నికల విభాగం అధి కారి సురేష్ ఉన్నారు.
పరిశ్రమల స్థాపనకు సహకరించండి
కృష్ణాజిల్లాలో పరిశమ్రల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉం దని, పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లోని తన చాంబరులో పారిశ్రామికవేత్తలు, మల్లవల్లి ఇండస్ర్టియల్ ఏరియాలోని పరిశ్రమల యజమానులు, అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహిం చారు. మచిలీపట్నంలో పోర్టునిర్మాణం త్వరలో పూర్తవుతుందని, జిల్లాలో పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. పెద అవుటపల్లి నుంచి కాజ వరకు తూర్పు బైపాస్‌రోడ్డు త్వరలో నిర్మాణం జరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే, అనుమతులను త్వరితగతిన మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి ఆర్ వెంకట్రావ్, ఏపీఐఐసీ జోనల్ మేనే జర్ సీతారాం, కాలుష్యనియంత్రణ మండలి ఈఈ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజు, బెల్‌కంపెనీ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 01:40 AM