ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒక్కచాన్స్‌తో దగా చేసిన జగన్‌

ABN, First Publish Date - 2023-11-06T00:19:05+05:30

ఒక్కచాన్స్‌ అని నమ్మించి జగన్‌ జనాన్ని దగా చేశాడాని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

జి.కొండూరు మండలం చెవుటూరులో ఉమా

జి.కొండూరు / గొల్లపూడి / రెడ్డిగూడెం / మైలవరం రూరల్‌, నవంబరు 5: ఒక్కచాన్స్‌ అని నమ్మించి జగన్‌ జనాన్ని దగా చేశాడాని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రెడ్డిగూడెం మండలంలో బాబుష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు వైసీపీని ఇంటికి పంపుతారన్నారు. గొల్లపూడి, జి.కొండూరు, కీర్తిరాయనిగూడెంలో ఓటర్‌ జాబితాలోని అవతవకలపై ఫిర్యాదు చేశారు. గొల్లపూడిలో గూడపాటి పద్మశేఖర్‌, సాధనాల వెంకటేశ్వరరావు, జి.కొండూరులో పజ్జూరు రవికుమార్‌, లంక రామకృష్ణ, ఉయ్యూరు వెంకటనరసింహారావు, అంకెం సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వేమిరెడ్డిపల్లిలో దేవదత్‌ భవిష్యత్‌ గ్యారెంటీ..

విస్సన్నపేట, నవంబరు 5: మినీ మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలతో పేదల భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు. వేమిరెడ్డిపల్లిలో ఆదివారం బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించి ఇంటింటికీ తిరిగి కర పత్రాలను అందించారు. కార్యక్రమంలో మట్టా వేణుగోపాల్‌, తొర్రి కృష్ణ, కవులూరు రాజ, ఆర్‌.శ్రీనివాసరావు, రాయల సత్యనారాయణ, పి.వాసు, మోరంపూడి చందు, నెక్కళపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

గృహాలు మంజూరుకాక ఇబ్బందులు

గంపలగూడెం: అమ్మిరెడ్డిగూడెం దళితవాడలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శావల దేవదత్‌ ఆదివారం మార్నింగ్‌ వాక్‌ నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పక్కాగృహాలు మంజూరుకాక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. శ్మశానవాటికకు దారి కల్పించాలన్నారు. తాళ్లూరి నాగేశ్వరరావు, పజ్జూరు నరసింహారావు, దిరిశాల వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T00:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising