ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పేర్ని నాని..ఓ చేతకాని దద్దమ్మ: కొల్లు రవీంద్ర

ABN, Publish Date - Dec 17 , 2023 | 12:53 AM

మచిలీపట్నం అసెంబ్లీ నియో జకవర్గంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించని ఎమ్మెల్యే పేర్ని నాని..ఓ చేతకాని దద్దమ్మ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నాచౌక్‌ వద్ద శనివారం ఆయన మీడి యాతో మాట్లాడారు.

మచిలీపట్నం టౌన్‌, డిసెంబరు 16: మచిలీపట్నం అసెంబ్లీ నియో జకవర్గంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించని ఎమ్మెల్యే పేర్ని నాని..ఓ చేతకాని దద్దమ్మ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్నాచౌక్‌ వద్ద శనివారం ఆయన మీడి యాతో మాట్లాడారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ఇప్పటికీ పంటనష్టంపై సరైన సర్వే జరగలేదన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా పరామర్శించే ప్రజాప్రతినిధులు లేరని రవీంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎంను ఒప్పించి రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యా రన్నారు. కొవిడ్‌ సమయంలో టీడీపీ నాయకులు ఏం చేశారని వైసీపీ నాయకులు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారంలో లేకపోయినా కొవిడ్‌ బాధితులను టీడీపీ నాయకులు ఆస్పత్రుల్లో చేర్పించారన్నారు. డివిజ న్లలో కూరగాయలు పంచుతుంటే టీడీపీ నాయకులపై కేసులు నమోదు చేశారన్నారు. కొవిడ్‌ సమయంలో సాయం అందించినందుకు తనతో పాటు టీడీపీ నాయకులపై ఇప్పటికీ కేసులు ఉన్నాయన్నారు. కొవిడ్‌ను వైసీపీ నేతలు వ్యాపారంగా మలుచుకుని, రెమిడైజర్‌ ఇంజెక్షన్లు బ్లాకులో అమ్ము కున్న సంగతి నిజం కాదా అని ప్రశ్నించారు. స్కానింగ్‌ సెంటర్లు పెట్టించి కమీషన్లు దండుకున్నది వాస్తవం కాదా..జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్‌ అందక కొందరు చనిపోలేదా..ఆస్పత్రిలో పడకలు లేక రోగులు నేలపై, వరం డాల్లో పడుకోలేదా అని రవీంద్ర ప్రశ్నించారు.

Updated Date - Dec 17 , 2023 | 12:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising