ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదం

ABN, First Publish Date - 2023-11-20T00:39:46+05:30

భారతీనగర్‌, నవంబరు 19: ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు ఆ రంగంలో అగ్రస్థాయికి చేరతారని ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్‌ కమిషనర్‌ కూరపాటి అజయ్‌కుమార్‌ అన్నారు. డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్ట్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ, అనంత్‌ డైమండ్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 14న జరిగిన డ్రాయింగ్‌ పోటీల విజేతలకు ఆదివారం స్పా కళాశాలలో బహుమతులను ప్రదానం చేశారు.

విజేతలతో అజయ్‌కుమార్‌, జాస్తి అనంత పద్మశేఖర్‌, పి.రమేష్‌ తదితరులు

భావవ్యక్తీకరణకు చిత్రలేఖనం దోహదం

ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్‌ కమిషనర్‌

కూరపాటి అజయ్‌కుమార్‌

భారతీనగర్‌, నవంబరు 19: ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుందని దానిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహిస్తే పిల్లలు ఆ రంగంలో అగ్రస్థాయికి చేరతారని ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్‌ కమిషనర్‌ కూరపాటి అజయ్‌కుమార్‌ అన్నారు. డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్ట్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ, అనంత్‌ డైమండ్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 14న జరిగిన డ్రాయింగ్‌ పోటీల విజేతలకు ఆదివారం స్పా కళాశాలలో బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్‌కుమార్‌ చిన్నారులు గీసిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మనిషిలోని భావాలను వ్యక్తపరచడానికి చిత్రలేఖనం దోహదం చేస్తోందన్నారు. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ ఆర్కిటెక్చర్‌ (స్పా)కళాశాల డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సిరికొండ రమేష్‌ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను చిన్నారులు వారి బొమ్మల ద్వారా చూపించారన్నారు. అనంత్‌ డైమండ్స్‌ అధినేత జాస్తి అనంత పద్మశేఖర్‌ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. డ్రీమ్‌ యంగ్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ ఆర్ట్‌ అకాడమీ అధ్యక్షుడు పి.రమేష్‌ తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్న ఇష్టాలను గుర్తించి ప్రొత్సహించాలని అన్నారు. వీజీఎస్‌ పబ్లిషర్స్‌ అధినేత నారాయణరావు, స్పా కళాశాల విద్యార్థుల ఎఫైర్స్‌ డీన్‌ ఎస్‌. వెంకట కృష్ణ కుమార్‌, రాజమండ్రి చిత్ర కళానికేతన్‌ కార్యదర్శి టి. మృత్యుంజయరావు, అమరావతి విజువల్‌ ఆర్ట్‌ సొసైటీ కోశాధికారి వి. వీరయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T00:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising