ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు ఒకే ఒక్క ఏపీ వ్యక్తి మృతి..

ABN, First Publish Date - 2023-06-04T12:42:24+05:30

ఒడిశా: బాలాసోర్‌ జిల్లాలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ముగ్గురు ఐఏఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిశా: బాలాసోర్‌ జిల్లా (Balasore District)లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Minister Gudivada Amarnath), ముగ్గురు ఐఏఎస్ (IAS), ముగ్గురు ఐపీఎస్ (IPS) అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరుపుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి అమర్ నాథ్ మాట్లాడుతూ ఒడిశా (Odisha)లో జరిగిన ఘోర రైలు ప్రమాదం (Rail Accident)లో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు చెందిన ప్రయాణికులు మృత్యువాత నుంచి దాదాపు బయటపడ్డారన్నారు. ఇప్పటి వరకు ఒకే ఒక వ్యక్తి మృతి చెందాడని, పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఉన్నారని తెలిపారు. గాయపడిన ప్రయాణికులను ఒడిశా, భువనేశ్వర్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలోని వివిధ ఆసుపత్రులకు తరలించామన్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో 309 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ప్రయాణిస్తున్నారని, ఏపీ నుంచి హౌరా వైపు 33 మంది ప్రయాణిస్తున్నారని అన్నారు. మొత్తం 342 మందిలో ఇప్పటి వరకు 331 మందిని గుర్తించామని, ఇంకా 11 మందిని గుర్తించాల్సి ఉందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు.

కాగా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident)లో తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రయాణీకుల గల్లంతుపై గందరగోళం నెలకొంది. కొందరిని అధికారులు గుర్తించారు. కోరమండల్ హౌరా యశ్వంతపూర్ రైళ్లలో మరికొందరు తెలుగు ప్రయాణీకుల వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రమాదంలో గాయపడిన కొందరు తెలుగువాళ్లను గుర్తించి ఏపీకి పంపారు. మరికొందరి ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో వారు ఏమయ్యారన్న టెన్షన్ నెలకొంది. ప్రమాదంలో ఒడిశాలో నివశిస్తున్న ఏపీకి చెందిన వ్యక్తి గురుమూర్తి మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. 16 మంది గాయపడినట్లు తెలిపారు.

Updated Date - 2023-06-04T12:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising