ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2023-11-10T00:03:50+05:30
సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15న అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీవీకే మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన ప్రజారక్షణ భేరి మహాసభలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కె. శ్రీదేవి, కె. సుబ్బరావమ్మలు పిలుపునిచ్చారు.
ప్రజా రక్షణ భేరి సభను జయప్రదం చేయండి
అజిత్‌సింగ్‌నగర్, నవంబరు 9 : సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15న అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీవీకే మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన ప్రజారక్షణ భేరి మహాసభలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటి సభ్యులు కె. శ్రీదేవి, కె. సుబ్బరావమ్మలు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం అజిత్‌సింగ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో సీపీఎం మహిళా నేతలు ఎరుపు రంగు చీరలు ధరించి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కె. సరోజ, జి. ఝాన్సీ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-10T00:03:54+05:30 IST