ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బటన్‌ నొక్కి జగన్‌ను ఇంటికి పంపేద్దాం

ABN, Publish Date - Dec 30 , 2023 | 01:03 AM

గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ తమకిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ స్థానిక ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు చేస్తున్న ధర్నా శుక్రవారం 18వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఎర్ర రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి అంగన్వాడీలు తమ నిరసన తెలియజేశారు. పలు కార్మిక సంఘాలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపాయి.

ధర్నాచౌక్‌లో అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతున్న పలు సంఘాల నేతలు ఎర్ర రిబ్బన్లు ధరించి..

ధర్నాచౌక్‌, డిసెంబరు 29 : గత ఎన్నికల సందర్భంగా సీఎం జగన్‌ తమకిచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ స్థానిక ధర్నాచౌక్‌లో అంగన్వాడీలు చేస్తున్న ధర్నా శుక్రవారం 18వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఎర్ర రిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి అంగన్వాడీలు తమ నిరసన తెలియజేశారు. పలు కార్మిక సంఘాలు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా ఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి ఎ.రవిచంద్ర మాట్లాడుతూ, గత 18 రోజులుగా సమస్యల పరిష్కారానికి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అంగన్వాడీల పది డిమాండ్లను పరిష్కరించినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పథకాలకు బటన్‌ నొక్కి డబ్బులు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రిని అంగన్వాడీలు బటన్‌ నొక్కి ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర నేత రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి తెలపకపోవడం సిగ్గుచేటన్నారు. అంగన్వాడీల ఉద్యమానికి కార్మిక సంఘాల పూర్తి మద్దతు ఉంటుందన్నారు. సీఐటీయూ జిల్లా నేత ఎన్‌సీహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీలు రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. మోదీ, జగన్‌ కార్మికులను అణచివేసే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏపీయూడబ్ల్యూజే సంఘం నేతలు వెంకట్రావ్‌, ఎంబీ.నాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ పత్రిక ప్రతుల దహనం

బంటుమిల్లి : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా 18వ రోజైన శుక్రవారం జగన్‌ పత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జగన్‌ పత్రికలో అంగన్వాడీలకు అన్నీ ఇచ్చామని చేస్తున్న అసత్య ప్రచారానికి నిరసనగా పత్రిక ప్రతులను దహనం చేశారు. కరోనా సందర్భంగా జనవరి 2 నుంచి 21వ తేదీ వరకు అంగన్వాడీలకు సెలవు ప్రకటించడం సిగ్గుచేటని, ఇది తాము సాధించిన నైతిక విజయని అన్నారు. కార్యక్రమంలో బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 01:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising