ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సాగు భూములకు పట్టాలివ్వండి

ABN, First Publish Date - 2023-12-03T00:30:18+05:30

తాము సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని 27 మంది జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును కోరారు.

కలెక్టర్‌ దిల్లీరావుకు వినతిపత్రం అందజేస్తున్న దళితులు

గంపలగూడెం, డిసెంబరు 2: తాము సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు మంజూరు చేయాలని 27 మంది జిల్లా కలెక్టర్‌ దిల్లీరావును కోరారు. గంపలగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు జాబితాను శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. తోటమూల - మేడూరు రహదారి సమీపంలోని 5.44 ఎకరాల ప్రభుత్వ భూమిని తాము 30ఏళ్లుగా సాగు చేసు కుంటున్నామన్నారు. ఈ అంశాన్ని తహసీల్దార్‌ ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లినా పట్టాలు ఇచ్చేందుకు నిరాకరించారని తెలిపారు. ఇప్పటికైనా పట్టాలివ్వాలని కోరారు. రెండు చోట్ల ఓట్లు ఉంటే ఒక ఓటు తొలగించాలని మాజీ సర్పంచ్‌ కోట కోటేశ్వరరావు కలెక్టర్‌ను కోరారు. నెమలి జడ్పీ పాఠశాల స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ దళిత నాయకుడు కుంభగిరి సురేష్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో మాధవి, తహసీల్దార్‌ జి.బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో నాగేశ్వరరావు, హైస్కూల్‌ హెచ్‌ఎం బి.కరణ్‌కుమార్‌, టీడీపీ నాయకులు రేగళ్ల వీరారెడ్డి, దిరిశాల వెంకట కృష్ణారావు, ఇన ుగంటి మధు, వైసీపీ నాయకులు కొత్తగుండ్ల నరసింహారావు, మందపాటి ఉమామ హేశ్వర రెడ్డి, కోట దాసు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T00:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising