30న జాబ్‌మేళా
ABN, First Publish Date - 2023-11-27T01:14:53+05:30
కేబీఎన్ కాలేజీలో ఈనెల 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు
కృష్ణలంక, నవంబరు 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు కేబీఎన్ కాలేజీలో ఈనెల 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సెసీ, ఇంటర్మీడి యట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అర్హత కలి గిన విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 16 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. వివరాలకు 6301990597, 9700090326, 9032633548లో సంప్ర దించాలని కలెక్టర్ తెలిపారు.
Updated Date - 2023-11-27T07:16:16+05:30 IST