జగన్‌ను సాగనంపడం ఖాయం
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:17 AM
వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్‌రెడ్డి తన పార్టీ ఇన్‌చార్జిలను మార్చే కార్యక్రమంలో ఉంటే రాష్ట్ర ప్రజలు ఏకంగా జగన్‌రెడ్డినే సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఎద్దేవా చేశారు.
పెనమలూరు, డిసెంబరు 17 : వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్‌రెడ్డి తన పార్టీ ఇన్‌చార్జిలను మార్చే కార్యక్రమంలో ఉంటే రాష్ట్ర ప్రజలు ఏకంగా జగన్‌రెడ్డినే సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఎద్దేవా చేశారు. ఆదివారం పోరంకి 7వ డివిజన్, కానూరు గ్రామాల్లో జరిగిన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో వారు స్థానిక నేతలతో కలిసి పాల్గొని ప్రజలతో మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రజలు జగన్‌రెడ్ది నాటకాలు, డ్రామాలు చూసి చూసి అలిసి పోయారని వచ్చే ఎన్నికల్లో సాగనంపడం ఖా యమన్నారు. రాజమండ్రి మహానాడు మేనిఫెస్టోలో చంద్రబాబు ఇచ్చిన హామీలను వివరించి వాటివల్ల ప్రజలకు వచ్చే లబ్ధితో కూడిన బాండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో దండమూడి సాయిసుధ, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, అబ్రహాం, శ్రీను, ఇక్బాల్, రమేష్, రఫీ, ఇనయతుల్లా తదితరులు పాల్గొన్నారు.
తాడిగడప, యనమలకుదురులో..
తాడిగడపలో జరిగిన కార్యక్రమంలో దేవినేని గౌతమ్, స్మిత దంపతులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు. వారి వెంట భద్రయ్య, ధనేకుల భార్గవ్ తదితరులు ఉన్నారు. యనమలకుదురు 57, 64, 65 బూత్‌ల పరిధిలోని ఇండ్ల లబ్ధిదారులకు భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అనంతనేని ఆజాద్, తమ్ము అశోకచక్రవర్తి, బలగం నాగరాజుకళ్యాణపు శ్రీనివాస్, వెలగపూడి శేఖర్, మాచిన శివ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
విజయవాడ రూరల్ : ముఖ్యమంత్రి జగన్ అడ్డగోలు పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టీడీపీ గన్నవరం ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. విజయవాడ రూరల్ మండలం అప్పారావుపేట, మంగళాపురం, పాతపాడు, నున్న గ్రామాలలో ఆదివారం జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేయనున్న వివిధ పథకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాటికాయలు కాజేసి ఈతకాయలు పంచిన చందాన వైసీపీ ప్రభుత్వ పథకాలు ఉన్నాయని, పథకాల మాటున పేదల సొమ్మును ప్రభుత్వం దోచుకుం టోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దండు సుబ్రహ్మణ్యంరాజు, గొడ్డళ్ల చిన్న రామారావు, కలకోటి శ్రీనివాసరెడ్డి, మాదు శివరామ్‌ప్రసాద్, మురళి, గంపా శ్రీనివాస్‌యాదవ్, వెంకటరత్నం, బెజవాడ శ్రీను, నాగేశ్వరరావు, కొండేటి శ్రీను, ఎం. వాసు, జనసేన నేత దుర్గారావు, సందీప్, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంధకారంలో నవ్యాంధ్ర
గన్నవరం : నవ్యాంధ్రను అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్‌రెడ్డిదేనని టీడీపీ సీనియర్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ ఉపాధ్యక్షులు జాస్తి మురళీకృష్ణ అన్నారు. స్థానిక ఎస్సీ కాలనీ లో బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాస్తి మురళీకృష్ణ మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. పేదోడికి రక్షణ లేకుండా పోయిందన్నారు. అభివృద్ధిని మరి చారని చెప్పారు. గత టీడీపీ హయాంలో సుమారు 2వేల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి జరిగితే వైసీపీ అధికారంలోకి వచ్చాక మచ్చుకు కూడా అభివృద్ధి కని పించటం లేదన్నారు. అందరు సంతోషంగా ఉండా లంటే చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. అలాగే యార్లగడ్డ వెంకట్రా వును ఎక్కువ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిన అవసరం నియో జకవర్గ ప్రజల మీద ఉందన్నారు. బూత్ ఇన్‌చార్జి తిరివీధి నరేష్, యూనిట్ ఇన్‌చార్జి కంభంపాటి కృష్ణకిషోర్, మోటుపల్లి కన్నె, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
Updated Date - Dec 18 , 2023 | 12:17 AM