ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌ పాలనలో జనానికి నరకం

ABN, First Publish Date - 2023-12-03T01:01:09+05:30

జగన్‌ పాలనలో జనం నరకం అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా అన్నారు. కంకిపాడులోని 176వ బూత్‌లో శనివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కంకిపాడులో నిర్వహించిన బాబు ష్యూరిటీ -భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

కంకిపాడు, డిసెంబరు 2 : జగన్‌ పాలనలో జనం నరకం అనుభవిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ, జనసేన పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా అన్నారు. కంకిపాడులోని 176వ బూత్‌లో శనివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు పెరిగాయ న్నారు. ఇంతటి నిర్లక్ష్య ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు జగన్‌ను గద్దె దించేందుకు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీతో కలిసి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు పులి శ్రీనివాసరావు, కొండా నాగేశ్వరరావు, ఏనుగ జయ ప్రకాష్‌, గోగినేని వెంకటరమణ, జనసేన పార్టీ నాయకులు మేదండ్రావు సతీష్‌, ముప్పా చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

పోరంకి బీజేఆర్‌నగర్‌లో..

పెనమలూరు : నాలుగున్నరేళ్ల సైకో పాలనలో అట్టడుగు స్థాయికి చేరిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్రంలోని అన్ని వర్గాల భవిష్యత్తుకు ఏకైక గ్యారెంటీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రమేనని తాడిగడప మునిసిపాలిటీ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. శనివారం పోరంకి బీజేఆర్‌నగర్‌ కాలనీలోని 123వ బూత్‌ పరిధిలో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు నేతృత్వంలో టీడీపీ నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వేమూరి ప్రసాద్‌, బొంగరాల అహ్రాం, చిలువూరి రాబర్ట్‌, బూక్యా సౌజన్య, వినుకొండ రాజా తదితరులు పాల్గొన్నారు.

గన్నవరంలో..

గన్నవరం : మండలంలోని పలు గ్రామాల్లో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఓట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. పట్టణం లో 136, 141, 129, 134 బూత్‌లలో ఓటర్‌ వెరిఫికేషన్‌ ఇన్‌చార్జి జాస్తి మురళీ, బుస్సే నాగప్రసాద్‌ ఓటర్ల జాబితాలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబుతోనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నాలుగున్నరేళ్ల కాలంలో జగన్‌ రాష్ర్టానికి చేసింది ఏమీ లేదన్నారు. అభివృద్ధి ఊసేలేదని చెప్పారు.

Updated Date - 2023-12-03T01:01:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising