జగన్‌కు దళితులంటే ద్వేషం
ABN, Publish Date - Dec 31 , 2023 | 01:37 AM
‘దళితులంటే సీఎం జగన్‌కు ద్వేషభావం, అందుకే అన్ని రంగాల్లో దెబ్బతీశారు. వైసీపీ పాలనలో బలైంది ఎస్టీ, ఎస్టీలే. టీడీపీ పాలనలో దళితులకు భారీ సబ్సిడీలు ఇచ్చి చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా నిలి పారు. అభ్యున్నతి వైపు అడుగులు వేసి దళితులు ఆత్మగౌరవంతో జీవించాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలి.’’ అని టీడీపీ దళిత నేతలు అన్నారు.
వైసీపీ పాలనలో బలైంది ఎస్సీ, ఎస్టీలే
చంద్రబాబును గెలిపించుకుని ఆత్మగౌరవంతో జీవిద్దాం
దళితగళంలో టీడీపీ దళిత నేతల పిలుపు
నందిగామ, డిసెంబరు 30: ‘‘దళితులంటే సీఎం జగన్‌కు ద్వేషభావం, అందుకే అన్ని రంగాల్లో దెబ్బతీశారు. వైసీపీ పాలనలో బలైంది ఎస్టీ, ఎస్టీలే. టీడీపీ పాలనలో దళితులకు భారీ సబ్సిడీలు ఇచ్చి చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా నిలి పారు. అభ్యున్నతి వైపు అడుగులు వేసి దళితులు ఆత్మగౌరవంతో జీవించాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలి.’’ అని టీడీపీ దళిత నేతలు అన్నారు. సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో నందిగామలోని ఆర్‌ఎస్ గార్డెన్‌లో శనివారం దళితగళం సభ నిర్వహించారు. వంగలపూడి అనిత, నక్కా ఆనంద్‌బాబు, తంగిరాల సౌమ్య, వర్ల రామయ్య, శావల దేవదత్, మోహనరావు, ఎంఎస్ రాజు, సాంగ సంజయవర్మ సభలో మాట్లాడారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా దళిత విద్యార్థులకు ముప్పై లక్షల వరకూ ఇచ్చి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివించారన్నారు. దళిత వైద్యుడు సుధాకర్‌ను జగన్ ఎలా హింసించారో అందరికీ తెలుసున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తదితరులపై జరిగిన దాడులను వివరించారు. శిరోముండనం, దళితుల ముఖాలపై మూత్ర విసర్జన ఘటనలు జగన్ పాలనలో జరిగాయన్నారు. వచ్చే ఎన్నికల్లో దళిత ద్రోహి జగన్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కేశి నేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్, నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు.
భారీ ర్యాలీ..
నందిగామ పట్టణంలో టీడీపీ ఎస్సీసెల్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి భారీగా తరలి వచ్చి, అంబారుపేట బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు సభకు వచ్చిన నేతలకు సాదర స్వాగతం పలికారు. ర్యాలీగా ముక్కపాటి కాలనీ వద్దకు చేరుకున్న నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి సభావేదిక ఆర్‌ఎస్ గార్డెన్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
Updated Date - Dec 31 , 2023 | 01:37 AM