ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటడిగే అర్హత జగన్‌కు లేదు

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:58 AM

వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేయమని అడిగే అర్హత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేదని గద్దె రామ్మోహన్‌ స్పష్టం చేశారు.

జగన్‌ మోసపు హామీల బుక్‌లెట్‌ను ఆవిష్కరిస్తున్న గద్దె రామ్మోహన్‌, నేతలు

ఓటడిగే అర్హత జగన్‌కు లేదు

జగన్‌మోహన్‌రెడ్డి మోసపు హామీల బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన గద్దె రామ్మోహన్‌

పటమట, డిసెంబరు 30 : వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేయమని అడిగే అర్హత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లేదని గద్దె రామ్మోహన్‌ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం జగన్‌మోహన్‌రెడ్డి మోసపు హామీలపై ముద్రించిన బుక్‌లెట్‌లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడు తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా రాష్ట్ర ప్రజలను సిఎం జగన్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా 5వ డివిజన్‌కు చెందిన నర్రా సుబ్బారావుకు, 7వ డివిజన్‌కు చెందిన దేవయ్యకు గద్దె ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం చేయకపోగా, మద్యాన్ని తన కనుసన్నల్లోనే విక్రయాలు చేయిస్తున్నారని అన్నారు. జగన్‌ పాలనలో 37వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తెలిపారు. చంద్రబాబు రూ. 200 ఫించన్‌ను రూ.2వేలు చేసిన విధానానికి, జగన్‌ నాలుగన్నరేళ్ళ తర్వాత రూ.2వేల పింఛన్‌ను రూ.3వేలుకు పెంచిన దానికి చాలా తేడా ఉందన్నారు. జగన్‌ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశాడని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన హామీల పట్ల ప్రజలకు ఒక నమ్మకం వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని గద్దె తెలిపారు. చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్‌, దేవినేని అపర్ణ, పొట్లూరి సాయిబాబు, ఎస్‌. ఫిరోజ్‌, రత్నం రమేష్‌, నందిపాటి దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising