ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారిశుధ్య కార్మికుల గోడు పట్టదా..

ABN, Publish Date - Dec 31 , 2023 | 12:53 AM

సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పట్టణంలో చెత్తపేరుకు పోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంటే పాలకవర్గానికి, అధికారులకు కనిపించడం లేదా అని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన శనివారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ కౌన్సిలర్లు సురేంద్ర, అబ్దుల్‌హుస్సేన్‌

తిరువూరు, డిసెంబరు 30: సమస్యలు పరిష్కరించాలని పారిశుధ్య కార్మికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పట్టణంలో చెత్తపేరుకు పోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంటే పాలకవర్గానికి, అధికారులకు కనిపించడం లేదా అని టీడీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గత్తం కస్తూరిబాయి అధ్యక్షతన శనివారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్‌, నాళ్లా సురేంద్ర మాట్లాడుతూ పట్టణం దుర్గంధంగా మారు తుందన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మునిసిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టరు చైర్‌పర్సన్‌కు లక్షరూపాయలు ఇచ్చానని, పనిలో 10 శాతం కమిషన్‌ అడుగుతున్నట్లు స్పందనలో ఫిర్యాదు చేశాడు. తిరిగి ఆదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిం చడం వెనుక డీల్‌ కుదిరిందా అని టీడీపీ కౌన్సిలర్లు నిలదీశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైసీపీ కౌన్సిలర్లు పరసా శ్రీనివాసరావు(బీరువాలబాబు), తంగిరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ, తొందరపాటులో ఫిర్యాదు చేసినట్లు చెప్పటం జరిగిందని వివరించారు. 8వవార్డులో మండల పరిషత్‌ రోడ్డు నుంచి కేడీసీసీ బ్యాంకుకు వెళ్లే కల్వర్డు అప్రోచ్‌ ధ్వంసమై ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా ఉందన్నారు. దానిని ఎప్పుడు నిర్మిస్తారని కౌన్సిలర్‌ సురేంద్ర ప్రశ్నించారు. త్వరలో పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో పందులు, కుక్కల బెడద అజెం డాలోని పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 12:53 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising