ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవంబరులో.. ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌

ABN, First Publish Date - 2023-10-30T01:10:19+05:30

ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన భవనాల నిర్మా ణాలకు దేవస్థాన అధికా రులు శ్రీకారం చుట్టడానికి ఎట్టకేలకు సిద్ధమవుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రధానంగా ఎలివేటెడ్‌ క్యూలైన్‌, అన్నదానం కాంప్లెక్స్‌, ప్రసాదం పోటులను సమీకృతంగా నిర్మించాలని సూచించారు. ఇందులో ముందుగా అన్నదానం కాంప్లెక్స్‌, ప్రసాదం పోటు భవనాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

తొలిదశలో ప్రసాదం పోటు, అన్నదానం కాంప్లెక్స్‌ నిర్మాణం

నిర్మాణాలకు రూ.57కోట్లతో అంచనాలు

ఇప్పటికే పెర్గోలా తొలగింపు

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : ఇంద్రకీలాద్రి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన భవనాల నిర్మా ణాలకు దేవస్థాన అధికా రులు శ్రీకారం చుట్టడానికి ఎట్టకేలకు సిద్ధమవుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌లో ప్రధానంగా ఎలివేటెడ్‌ క్యూలైన్‌, అన్నదానం కాంప్లెక్స్‌, ప్రసాదం పోటులను సమీకృతంగా నిర్మించాలని సూచించారు. ఇందులో ముందుగా అన్నదానం కాంప్లెక్స్‌, ప్రసాదం పోటు భవనాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముందుగా కనకదుర్గానగర్‌లో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీని కోసం దసరా నవరాత్రుల ఏర్పాట్లు చేస్తున్నప్పుడు పెర్గోలాను తొలగించారు. ఆ ప్రదేశంలోనే ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణం జరగబోతున్నది.

రెండు భవనాలకు రూ.57కోట్లు

ఇంద్రకీలాద్రికి ఆగ్నేయ దిశలో ప్రసాదంపోటును ఏర్పాటు చేయాలని మాస్టర్‌ప్లాన్‌లో కన్సల్టింగ్‌ ఏజెన్సీ సూచించింది. అమ్మవారి పోటు భవనాన్ని రెండు అంతస్తుల్లో గోశాలకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించాలని భావిస్తున్నారు. యంత్ర సామగ్రి ఏర్పాటుకు రూ.6 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఆలయానికి భక్తులు వచ్చే సంఖ్యను అంచనా వేసి ప్రసాదంపోటు, అన్నదాన కాంప్లెక్స్‌లను నిర్మించాలని భావిస్తున్నారు. ప్రసాదంపోటు కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.27కోట్లతో అంచనాలు రూపొందించారు. అన్నదానం కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.30కోట్లతో అంచనాలు తయారు చేశారు. ప్రస్తుతం అన్నదానం మహామండపంలోని మూడో అంతస్తులో నిర్వహిస్తున్నారు. వంటలను మాత్రం మలి ్లకార్జున వీధిలో ఉన్న శృంగేరీపీఠం భవనంలో చేస్తున్నారు. అన్నదానం ఒకచోట, వంటల తయారీలో మరోచోట ఉండడంతో రవాణాకు ఇబ్బంది అవుతోంది. దసరా మహాత్సవాల్లో రద్దీని తట్టుకోలేక అన్నదానం రద్దు చేసి, ప్రసాద పంపిణీ చేయాల్సి వస్తోంది. అన్నదానానికి సమీకృత భవనం నిర్మించడానికి టెండర్లను ఆహ్వానించారు.

తొలుత ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌

దసరా నవరాత్రులు, భవానీదీక్షల విరమణ రోజుల్లో ఇంద్రకీలాద్రికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ రెండింటికీ దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఇందుకోసం ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేకంగా తాత్కాలిక క్యూలను ఏర్పాటు చేయాల్సి వస్తోంది. వినాయకుడి ఆలయం నుంచి క్యూలు నిర్మిస్తున్నారు. ఇక రహదారులపై క్యూలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా కనకదుర్గనగర్‌లో ప్రత్యేక ఏర్పాటు చేయాలని మాస్టర్‌ప్లాన్‌లో ఎలివేటెడ్‌ క్యూ ఏర్పాటు చేయాలని డిజైన్‌ చేశారు. కనకదుర్గనగర్‌లో మూడు నాలుగు అంతస్తుల్లో క్యూ కాంప్లెక్స్‌ నిర్మిస్తారు. ఇందులో తిరుమల మాదిరిగా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేస్తారు. కనకదుర్గనగర్‌ ప్రారంభం నుంచి ఈ క్యూ కాంప్లెక్స్‌ వరకు ఒక మినీ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. తిరుమల మాదిరిగా కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులను దర్శనానికి వదులుతారు. ఖాళీ అయిన కంపార్లుమెంట్లలోకి భక్తులను పంపుతారు. ఈ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.10కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.

Updated Date - 2023-10-30T01:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising